Monday, August 2, 2021

శివోహం

జన్మజన్మల నుంచి ఇదే స్థితి
ఏ జన్మలో మారేను నా గతి
నీ తోడు లేకపోతే నా బతుకు
పోరాటంలో నిస్సహాయముగా
రోదనలు ఆక్రందనలు మినహా
ఆదుకునే నాధుడు లేడు అందుకే
నీ నీడను ఓ రాట వేసుకుని
నిలిచిపోతాను పరమేశ్వరా
ఆదుకో ఆది దేవా...

మహాదేవా శంభో శరణు...

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...