జ్ఞానమేది
అజ్ఞాన మేది అనేది తెలుసు కోవటము లోనే సగము జీవితము వ్యర్ధమై పోతుంది శివ...
సుఖాలకోసం, కోరికలు తీర్చు కోవటం కోసం సగములో సగము జీవితము నిద్రలో మినిగి పోతుంది...
మనసారా నిన్ను కొలిచేదెన్నడు...
తనివితీరా నీ నామం జపించేది ఎన్నడూ...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment