శంభో...
అందరు అడుగుతున్నారు...
నేను నిన్ను కోరిక కోరుకుంటానని...
ఎం కోరిక ఉంది నాకు...
ఎదలో ఉన్న నిన్ను ఎదురుగా చూడాలనే కోరిక
ఎదురుగా ఉన్న నిన్ను నా ఎదలో నిలుపుకోవాలనే కోరిక తప్ప ఇంకేం కోరుకుంటా శివ...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment