శంభో...
నీ వెక్కడ ఏ రూపంలో నో ఉంటావో నాకు తెలీదు...
కానీ నీవున్నావన్న పరిపూర్ణ విశ్వాసంతో నేను నీ కృపకై నిరీక్షిస్తూ ఉన్నా...
అది నిరూపించుకునే బాధ్యత నీదే ఈశ్వరా...
నా రక్షణ భారం కూడా నీదే పరమేశ్వరా...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment