పరమపురుష శ్రీపతివి...
పరిపూర్ణ లక్ష్మీ పతివి...
భక్తులకు పరమాత్మవి ..
ఈర్ష్యలేని శ్రీ వెంకటేశ్వరుడివి నీవు...
కలియుగ మానవులకు కలి మాయబాధల నుండి రక్షించే కలియుగదేవుడవు నీవే శ్రీహరి...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment