నీనామమే గానముగా...
నీగానమే ప్రాణముగా...
జపించి తపించువాడాను...
అడుగు అడుగున అడ్డంకులు కల్గించి
అయినదానికి కానిదానికి పరీక్షలు పెట్టకయ్యా...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment