నాలో నీవు ఉన్నావు ఇది శివ శాసనం
నీతో నేను ఉండాలి ఇదీ శివ శాసనమే
కానీ నేను ఎవరి మాయలోనో పడి నీకు దూరము అయ్యాను
శ్మశానముల పుంత లో కానీ గుర్తు రావటం లేదు
శాసనముల శిలలు (బొమ్మ రాళ్లు)
యేదో ఒకటి వ్రాసి నీ దారికి తెచ్చుకో శివా...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment