శంభో!!!నీ అనంత భక్త జన కోటిలో నేను ఓ నీటి బిందువును...
నీ దాసానుదాసుడను...
అన్యమేరగని నాకు నన్ను రక్షించడంలో...
నిను మించిన ఘనుడెవ్వరు ఆర్తరక్షకా...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment