నీలో ఉన్న తేజాన్ని నేనని...
అహం చూపానో ఏమో...
నీ నుండి దూరం చేసి మాయ కప్పి
ఆటలాడుతున్నావు....
నిన్ను వీడి ఉండలేను...
ఈ జన్మల పరంపర ప్రవాహానికి
ఆనకట్టవేసి ఆదుకోవా...
నీ ఒడిని చేర్చుకోవా..
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment