Sunday, September 27, 2020

శివోహం

తండ్రీ శివప్పా

నీ 
అక్కున చేరి 
ఆరాధించాలనీ 
అక్షరాలకు ఎందుకింత ఆరాటం ?

నీ 
పాదాల చెంత 
పావనమవ్వాలనీ 
పదాలకు ఎందుకింత పరవశం ?

నీ 
భక్తునిగా 
బంధీగా మారిపోవాలనీ
భావాలకు ఎందుకింత భావోద్వేగం ?

శివోహం  శివోహం

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...