Monday, September 28, 2020

శివోహం

కుటికోసం కాయకష్టం చేసి చేసి....

నేను అని మరిచి సమస్తం నీవేనని తలిచి
కనులు మూసి సేద తిరేవేళ కలలో నీవే...

ఎదురుగ వచ్చావని పొంగిపోయి నే కళ్లు తెరచి చూడగా కళ్లముందు నిలిచింది స్వప్నమని తెలిసి నా మనసు చిన్నబోయింది...

ఏమిటి నీ లీలలు ఏమిటి నీ మాయ తండ్రి...

నా ఆయువు దీపం నాకు నేనుగా అర్పుకోవటానికి.. 
నీ చివరి చూపుకై నా ఈ ఎదురు చూపులని నీకు తెలియదా...

మహాదేవా శంభో శరణు....

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...