శివా!ఆది భిక్షువైన నిన్నే అర్ధిస్తున్నా
దుర్భిక్షములన్ని నాకు దూరము చేసి
సుభిక్షమవనీ నా భక్తి జ్ఞాన సేద్యం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment