ఎలా ఓర్చుకుంటున్నావు ?
ఆ చితి మంటల వేడి సెగలను ??
మరెలా భరిస్తున్నావు ?
ఆ కన్నీటి శాపాల శోకాలను ??
కాస్త !
ఇంటి ముఖం పట్టు !!
కైలాసం చేరుకో తండ్రీ !
నీకూ ఒక కుటుంబం ఉందిగా !!
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment