నీ కృపా
కటాక్ష వీక్షణాలలో
ఎన్నెన్ని కఠిన పరీక్షలో కదా
నీ రక్ష కోరుతూ
నిరీక్షించే ప్రతీ క్షణం
నీవు ప్రసాదిస్తున్న భిక్షే కదా తండ్రీ
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment