*దైవముపై ద్యాస కలుగడము అంత సులభము కాదు. మీ గత జన్మ పుణ్యఫలమో లేదా మీ వెనుకటి తరాల వారి భక్తి ఫలమో తోడైయుండట చేత నేడు మీకు దైవంపై స్పృహ కలిగినది. ఇది అందరికినీ చిక్కేటటువంటి అవకాశం కాదు. అయితే ఇందులో దైవ సంకల్పమూ లేకపోలేదు. మెుక్క పెరుగుటకు నీరే కాకుండా సూర్యకాంతి కూడా అవసరమే. దైవ శాసనముననుసరించియే సకల సృష్టి నడవగలుగుతుంది. మీ మీ పూర్వ సాధనల ఫలముల వలన దైవం మీకు నేడు దిశా నిర్దేశం చేయడం జరుగుతుంది. భగవంతుడు మీకు అవకాశములను మాత్రమే ఇస్తుంటాడు. మీరు చిక్కిన అవకాశమును వదలక దక్కించుకోవాలి.*
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
Thursday, August 27, 2020
Subscribe to:
Post Comments (Atom)
శివోహం
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
-
శివా!మట్టితో అనుబంధ మెంత గొప్పదో పుట్టి గిట్టుటలోన నేను మట్టినే కూడి మట్టి బొమ్మను నిను తెలిసి మురిసినాను మహేశా . . ... . శరణు .
-
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! సందేహాల పురమీ మానవ దేహం అహం, మోహం రెండూ గుణశ్రేణియై నీకు నాకు మధ్య దూరం పెంచుతున...
-
శివా! నీ నాట్యానికి నా అహము వేదిక కానీ నీ నామము నా పదమున దీపిక కానీ నా గమనం నిన్ను చేరీ ముగిసిపోనీ మహేశా.....శరణు.
No comments:
Post a Comment