ఒకే ఒక కోరిక స్వామి...
నా చివరిచూపు నీ రూపంగ కరిగిపోవాలి..
నా చివరి శ్వాస నీలో చేరిపోవాలి..
నీ ఒడిలో ఒదిగిపోవాలి..
నీ చేతి స్పర్శలో చనిపోవాలి..
ఇదే నా చివరికోరిక..
అదే మన తొలి కలయిక..
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment