మా కనులకు కానరాని నీవు...
కండకావరమెక్కి నిను గానక మేము కళ్ళు మూస్తుంటావు...
నడుమ కష్టాల నిచ్చి నిదుర మత్తు నొదిలించి కళ్ళు తెరిపిస్తుంటావు ...
మరి యిక మాయతెరలు తొలిగించేదెపుడో ...
మా యీ కనులకు..
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment