అఖండమైన
చితి మంటల మహా యజ్ఞంలో
కాలిపోయే కట్టెనే కావచ్చు
కపాల మోక్షం నాకెందుకు తండ్రీ
కైలాసం కరుణించిన నాడు
నీ చేతి భిక్షాపాత్రను నేనవ్వనా
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment