Sunday, June 21, 2020

శివోహం

చిత్రాతి చిత్రము ఇది ఎంతొ చిత్రము
ఎదురుగనున్న ఎరుక రాని చిత్రము

శిల శిలలో శిల్పముంది
ఉలి నర్తనతో అది తెలుస్తుంది
జడమైన శిలలో జీవమపుడు కనిపిస్తుంది
మౌనమైన భాషలో  నిన్ను పలకరిస్తుంది

కోర్కెలన్నవి తనకు దూరమంటుంది
తనపర భేదములు తెలియవంటుంది
కలిమిలేములు ఏవి కానవంటుంది
కదలకుండానే నిను కూడి వస్తుంది

ధ్యాన మెరిగెడి విధము తెలియజెప్పు
మౌన వ్రతము ఎటులో మిగులజెప్పు
ఏకాంత వాసమును ఎరుగజెప్పు
శాంతమనస్కుడుగ నిన్ను మెలగజెప్పు

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...