శివా! ఆశకు అడ్డుపెట్టి శ్వాసకు కళ్ళెమేసి
చూపును చిక్కబట్టి నీ కోసం చూస్తున్నా
అనిపిస్తావో అగుపిస్తావో నీ దయ.
మహేశా ..... శరణు .
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment