బిళ్వపత్రనికీ నీ కోవెలలో స్థానమిచ్చావు...
మరి నేను చేసిన నేరమేమి శివ....
నాలో వున్న ఆత్మవి నీవేగా....
మరి నా బ్రతుకునిశిలో భక్తి కాంతులు....
నింపి నీదరిచేర్చే బాధ్యత నీదే కదా తండ్రి....
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment