Sunday, June 21, 2020

ఓం

 శివా!ఆ ఇల్లు ఈ ఇల్లు ఎన్నాళ్ళు తిరగాలి
సొంతిల్లు ఇల్లు  చేర నేను ఇంకెన్నాళ్ళు ఆగాలి
నినుకాక నేను ఇంకెవరినడగాలి
మహేశా . . . . . శరణు .

శివా!నీ ఉన్నావని నేనెంతో నమ్మకంగా ఉన్నా
ఊగుతోంది విశ్వాశం ఊయలెక్కి ఎందుకో
ఊయల దిగి విశ్వాసం నిశ్చలమైపోనీ
మహెశా . . . . . శరణు .

శివా!ఆది భిక్షుని చేరి అడుగుచుంటి
జ్ఞాన భిక్షను నాకు ఒసగమంటి
క్షమా భిక్షకోరి శరణమంటి
మహేశా ..... శరణు.

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...