శివా! ఇన్ని రాత్రులేల ఈ నర జన్మకు.
ఒక్క రాత్రి చాలు అది శివరాత్రి అయిన
అది తెలియనిమ్ము జన్మ ముగియనిమ్ము
మహేశా..... శరణు
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment