సర్వ జీవులందు కొలువై....
జగమును ఏలే పరమ పావనుడాతడు....
దోసెడు నీళ్లు తలమీద పోసి భక్తి మీర కొలువగా ....
పాపులను బ్రోచే పుణ్యమూర్తి అతడు.....
ఆర్తుల రక్ష జేయ జగమంతయు నిండిన వేల్పుడతాడు...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment