పిల్లన గ్రోవిని కైగొని...
మెల్లన రాగముల మధుర
మృదురవములలో పల్లెను స్వాంతన పరచి..
అల్లరి చేష్టలలరించు కృష్ణాపరమాత్మ నీకు వందనం..
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment