Saturday, March 21, 2026

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
ఊపిరి మాత్రమే నిలిపావు జీవితాన్ని దూరం చేస్తూ...
కన్నీరు మాత్రమే మిగిల్చావు ఆనంద భాష్పాలు ఆవిరి చేస్తూ...
కష్టాలు మాత్రమే కనిపించాయి సుఖ సంతోషాలు మాయం చేస్తూ...
అయినా ఏమి బాధా లేదు మిగిలిన ప్రపంచాన్ని సూన్యం చేస్తూ నీ సన్నిధి మాత్రమే ఇస్తే చాలు అలాగే నీదు మాయ చేత పెనుమాయ జయించు శక్తినివ్వు చాలు.
శివ నీ దయ

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

గోవిందా!
అంతరంలో ఏదోతెలియని దిగులు...
ఉన్నది వదిలేసి లేని దాని కోసం బ్రమసి నిరంతరం వెంటరాని వాటి కోసం విలపిస్తున్నానేమో...
నువ్విచ్చిన ఈ మేనును మమతలమాలగామార్చి నీ పదముల చెంతచేరాను.
ఉన్నదని ఉరుకులు లేవు. 
ఏమి లేదని వేదన లేదు...
నేను కోరిన నువ్వు నా చెంత
ఉండు ఏ చింత లేకుండా నీ పాదాల చెంత కాసింత చోటు ఇవ్వు.

ఓం నమో వేంకటేశాయ.
ఓం నమో నారాయణ 

శివ నీ  దయ.

Sunday, March 15, 2026

శివ నీ దయ

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
క్షణాల కెరటాల కింద దుఖపు మబ్బు నిండ వ్యాపించిన కన్నీటి చుక్కని నేను....
నన్ను చూస్తూ కూడ పలకరించని శబ్దానివి నీవు...
సర్వమూ ఎరిగిన నీవు కూడా దయచూపకున్న ఆదుకును దిక్కెవ్వరు తండ్రి.

శివ నీ దయ.

Tuesday, March 3, 2026

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!
నా తలరాత ఎలా ఉన్నా నీ హృదయంలో నాకు కాసింత చోటు కల్పించు...
శాశ్వతమనుకునే ఈ భవ బంధాల మాయ నుంచి నన్ను తొలగించు...
ఆట రాని వాడిని నేను ఈ పరమపద సోపానంలో నివే నన్ను గెలిపించు...
మీ చేతిలో ఉన్నవి, మీ చెప్పుచేతుల్లో ఉండేవి కొన్ని ఈ దాసునికి భిక్షగా ఇచ్చి నన్ను నీ వాడినని నిరూపించు.

శివ నీ దయ

Monday, March 2, 2026

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
మా జీవితమే ఒక వైకుంఠపాళీ 
పైకి ఎగదోసే నిచ్చెనలు తక్కువ
క్రిందికి పడదోసే పాములే ఎక్కువ...
ఈ జీవిత చదరంగంలో జీవులందరినీ పావులు చేసి
నడిపేది, నడిపించే జగన్నాటకసూత్రధారి నీవే కదా హర.
మా చేతిలో లేని వాటికి 
వగర్చి వెంపర్లాడెలా చేసి
మాది కానీ ఈ దేహాన్ని మోస్తూ
తప్పులు చేస్తూ ,తడబడుతూ
మనసుకు మంచితనపు ముసుగులు వేస్తూ నయవంచక బ్రతుకునీడ్చుకుంటు ముందుకు సాగే వ్యర్ధపుజివితం ఇది..
కొంచం కన్నీరు
కొంచం పన్నీరు
ఇదే జీవితపు రాకపోకల ఆట నీ దయ.

శివ నీ దయ.

Thursday, February 26, 2026

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

పార్వతి మానస పుత్రుడు.
తల్లియానతితో శివుడినే ఎదిరించినవాడు..
లోకకళ్యణార్థం గజానుడై..
త్రిమూర్తుల ఆశీస్సులందు కున్న పూజనీయుడు.
మూషిక వాహనుడు.
ఓంకార రూపుడు
జ్గ్నాన స్వరూపుడు..
శ్రీకరుడు...
శుభకరుడు..
విఘ్న రాజుడు..
తల్లితండ్రుల చుట్టూప్రదక్షిణమే
సర్వపుణ్య తీర్థ సందర్శనమని
లోకానికి చాటిన వాడు...
ప్రథమ పూజ్య గణాదిపుడు
శివ పార్వతుల తనయా...
ఓ లోకారాధ్య వినాయకా..
*ఓ ప్రథమ పూజ్యుడా*
పాహిమాం పాహిమాం గణేశా.

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...