Tuesday, February 3, 2026

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
ఓ వైపు ప్రాపంచిక చింతనలు ...
మరోవైపు మీ నామ చింతన...

యెడ తెగని కోరికలొకవైపు...
ఏడేడు లోకాలు ఏలే మీరు మరోవైపు...

సంసారిక జీవనం లో మునకల ముచ్ఛటలు ఓవైపు...
మీ నామస్మరణ సాగరఘోషగా మారాలని మరోవైపు...

ఏది ఏమైనా మీ దయనే.

Thursday, January 22, 2026

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
నా దారిలో ప్రతి అడుగు నీ వైపు...
నా మాట లోని ప్రతి అక్షరము నీ మంత్రమే...
నా చూపు లోని ప్రతి దృశ్యం నీ వెలుగు...
నా మనసు లోని ప్రతి తలపు నీ స్మరణకు...
నా నవ్వు లోని ప్రతి దరహాసం నీ దర్శనమే...
నా ఊహ లోని ప్రతి ధ్యాస నీ ధ్యానమే...
నా ఊపిరి లోని ప్రతి శ్వాస నీ నామమే.

శివ నీ దయ.

Wednesday, January 21, 2026

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
మీ దయ చేత ఇన్ని సార్లు రాగలిగాను, 
ఏమో మీ మాయ చేత ఇంకేమి చేయిస్తావో కానీ కర్మలంటూ కట్టి పడేయకు...
జన్మలంటూ ఇంకా ఇంకా నాది కాని లోకంలో తోసివేయకు.

శివ నీ దయ.

Tuesday, January 20, 2026

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u


శివ!
మీ పాదముల చెంత రవ్వంత చోటు కోసమే ఈ ఆరాటము...
కనబడని ఆ ఆరు శత్రువులతో సదా పోరాటము.

శివ నీ దయ.

Wednesday, January 14, 2026

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
ఆశ సంతోషం ను చెరిపేస్తూ దుఃఖము పై దుందుభి వాయిస్తూ ఉంది...
ఆనంద మనే ఆయుధం ఇచ్చి సంరక్షకుడివై ఉండు...
మము నీ లాలన లో ఉంచు…
నీ పాలన లో పెంచు…
మా చింతలను చెరపి…
నీ చెంతను ఉంచు.

శివ నీ దయ.

అమ్మ దుర్గమ్మ శరణు



అమ్మ దుర్గమ్మ!

ఈ లోకము తనకు తానుగా పైకి మురిసిపోతూ 
ఎన్నెన్ని మాయలు చేసినా,
తుదకు అవన్నీ మహామాయ ఐన మీ ముందర నిలబడలేక, ఓడిపోక తప్పదు కదా అమ్మ.

ఏది ఏమైనా మీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే.
అమ్మమాయమ్మ దుర్గమ్మ శరణు.

ఓం శ్రీ మాత్రే నమః

గోవిందా

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

మందార మంకరంద మాలను ధరించిన వాడవు...

మన్మధ లీలలను వశ పరుచు కున్న   వాడవు...

మణిని ధరించి జగతికి వెలుగును చూపిన వాడవు

మాలో ఉన్న అజ్ఞానమును తొలగించే గురువు...

అహంకారమును తొలగించి ప్రేమను పంచే తల్లితండ్రి...

అసంతృప్తిని తొలగించి సంతృప్తిని ఇచ్చేదేవుడిలా
మాలో సఖ్యత కల్పించి నావు...

హరి శరణు.

ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః
ఓం నమో వేంకటేశాయ 
ఓం నమో నారాయణ

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...