Tuesday, January 6, 2026

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
నా అభ్యర్థనను ఆలకించు...
నా అభ్యర్థనను ధ్యానంగా స్వీకరించు...
నా మాట ఎందుకు వినవు? నీవు...
నాకు నువ్వు తప్ప ఎవరూ ఉన్నారు...
అన్యమేరగని నాకు నువ్వే నా రక్షకుడివి...
నా అదృష్ట దాతవి...
నువ్వే నా విధి...
నువ్వే నా బలం అందుకే నంది చెప్పిన నా అభ్యర్థనను అంగీకరించండి...
నా అభ్యర్థనను కాపాడండి.

శివ నీ దయ.

Saturday, January 3, 2026

గోవిందా

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

గోవిందా!
చిత్తం శ్రీకరమై 
భౌతికావలంబం శుభకరమై నీ హృదయం లోనికి పయనించే ఈ జీవికి...
కష్టం క్షణికం...
మోక్షం కరతలామలకం
నీ అభయం కనిపించే కనులకు 
నీ నాయకత్వం మాత్రమే ఆగుపించే బుద్ధికి తన రక్షణా భారం నీదై కనిపిస్తుంది 
యోగ క్షేమ బాధ్యత నీదని తలుస్తుంది 
ధ్యానమే అనుభవాన్ని సమర్పిస్తుంది
అనుభవ యోగమే ఆనంద సామ్రాజ్యాన్ని స్థాపిస్తుంది తండ్రి.

ఓం నమో వేంకటేశాయ.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

హరిహర పుత్ర అయ్యప్ప!
తెలిసితెలియక ఎన్నో పొరపాటులు చేసి ఉండవచ్చు...

నాపై నీ అంతరంగమున ఏమున్నా నేను నీ బిడ్డడను...

నన్ను ఆదుకోవలసినవాడవు నీవే తండ్రి... 

ఏ క్షణము నిను మరువను...
మరి ఏ క్షణము నా చేయి విడవకు!!

మణికంఠ శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ 
దిక్కు లేని నాకు దిక్కు నీవే శివా...
ఈదనలవి కాదు ఈదలేను...
లోకమందు యున్న లోగుట్టు తెలియదు చేయినిచ్చి నన్ను చేర నివ్వు.

శివ నీ దయ.

Friday, January 2, 2026

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
నా లోన నీవు గలవు...
నీ లోన నేను గలను...
ఆత్మ యందు నీవే అంతర్యామి... అనంతమందు నీవే సర్వాంతర్యామి...
నా కనుల ముందు నీ రూపము...
నీ కనుల ముందు విశ్వమే రూపము...
పచ్చని తోరణం నిత్యము ఋణము.

శివ నీ దయ.

Thursday, January 1, 2026

శివోహం

అమ్మ అని పిలుస్తూ ఉంటే ఏదో ఒక రోజున తప్పక పలుకుతావు, ఆడిస్తావు, అక్కున చేర్చుకుంటావు.

అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే కదా
ఓం శ్రీ మాత్రే నమః 
ఓం దుర్గాదేవినే నమః

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
నీకు దూరమై ఏలాగో కాలం గడుపుతూనె ఉన్నా...
పెదవి కదుప కుండానే నిరతం నిను పిలుస్తూనె ఉన్నా...
కర్మానుసారముగా నడుస్తూ నా మదిలోని తలపులను, కష్టాలను తెలుపు కుంటున్నాను...
కనుపాపగా నీవే నా చెంత ఉండి
నా గమ్యం ఏమిటో తెలియపరుచు.

శివ నీ దయ.

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...