Sunday, November 23, 2025

హరిహర పుత్ర అయ్యప్ప

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

హరిహర పుత్ర అయ్యప్ప !
గుండె గూటిలో వెలుగుతున్న
జ్యోతి నీ పాద సన్నిధి కడ
దీపారాధనగా వెలిగించాలి...
నా ఆవేదన నీకు నివేదన గా అర్పించాలి...
అన్య కోరికలు కోరను 
నీ దర్శన భాగ్యం చాలు తండ్రి.

మణికంఠ శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
నా జీవితమే ఒక స్వప్నం
నిన్నటి రోజున ఉన్నది 
నేడు లేకపోయే..

ఈరోజు ఈ క్షణం
తర్వాత ఏమగునో
అందుకే శివా అంటూనే ఉంటాను
ఏదో సమయంలో వచ్చి
నన్ను చూసిపో.

శివ నీ దయ.

Thursday, November 20, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

ఏ దిక్కున చూసినా
నా దిక్కు నీవేనయా
ఓ ముక్కంటీశా...
ఒక్కసారి
నీ అక్కున చేర్చుకోరాదా
నే మక్కువగ నిను కోరుచుంటి
నీవొక్కడివే నాకు తోడునీడ

శివ నీ దయ.

Wednesday, November 19, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

ఏదో ఒక రోజున మిమ్ము చేరే వాటికై, ఉన్నంత కాలం అలుపులేక పరుగులు తీసేలా చేయిస్తావు...
ఏమి మీ మాయ? తండ్రీ శ్రీ మణికంఠ.

హరిహర పుత్ర అయ్యప్ప శరణు.

Monday, November 17, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

ఏదో ఒక రోజున మిమ్ము చేరే వాటికై, ఉన్నంత కాలం అలుపులేక పరుగులు తీసేలా చేయిస్తావు...
ఏమి మీ మాయ? తండ్రీ శ్రీ మణికంఠ.

హరిహర పుత్ర అయ్యప్ప శరణు.

Tuesday, November 11, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

సదాశివ!
తెలిసి కొన్ని, తెలియక కొన్ని తప్పించు కోలేని తరుణంలో చేసితిని తప్పులు...
ఎన్ని కన్నీటి వర్షాలు కురిసిన...
గుండె మంటలారాటం లేదు...
తప్పు చేసినట్లు విన్నవించు చున్న...
తప్పు క్షమించి నా మనసులో మాట చెవిని పెట్టు
నీ ఆట కాస్త విడిచి పెట్టు
నన్ను ఉద్ధరించగ దృష్టి పెట్టు.

శివ నీ దయ.

హరిహర పుత్ర అయ్యప్ప

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

ఎక్కడ ఉన్నా
ఎలా ఉన్నా
ఏ పని చేస్తున్నా,
భయంలో, బాధలో, సుఖంలో, సంతోషంలో
పాలలో కాస్త చక్కెరనో
తేనెనో కలుపుకొన్నట్లు
జీవితంలో మీ నామాన్ని కలుపుకోనీ మీ నామ ధ్యానంలో మునిగి నిరంతర మీ నామా స్మరణమే. 

హరిహర పుత్ర అయ్యప్ప శరణు.
శివ నీ దయ 

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...