Wednesday, October 15, 2025

శివోహం

శివ!
త్రిశూలం పట్టుకుంటావు, శ్మశానంలో ఉంటావు..
పులి తోలు చుట్టుకుంటావు, బూడిద రాస్తావు, పుర్రెల హారం చుడతావు నీదేమి అందమయా గౌరీశా.
ప్రాణాలు తీసేది నీవు నిందలు ఏమో యముడికి...
అసలు నువ్వంటే భయంతో చావాలి కానీ చచ్చినాకా నీ దగ్గరకే చేరాలని తపస్సు ఎలా హర మాకు.

శివ నీ దయ.

Tuesday, October 14, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

నిన్ను వెతుకుతూ లోకం తిరిగితే నేను దొరికాను.

శివ నీ దయ.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళే వాడిని కాను నేను ..

అక్కడి నుండి ఇక్కడకి వచ్చిన వాడిని...

భూలోక యత్రికుడిని.

ఓం నమః శివాయ

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
దేహమనే దేవాలయంలో అహమను విడిచిపెట్టి మనసునే ఒత్తినీ వెలిగించి ఆ వెలుగారి పోకుండా ఊపిరి నిలిపి
రాకపోకల గమనాన్ని గమనిస్తున్నా...
విశ్వశక్తి సహస్రారం నుంచి ఆ కాంతి నెమ్మదిగా దిగి ఆజ్ఞా చక్రంపై జ్యోతియై వెలగగా ఆ వెలుగులో
నిను గాంచితిని...
వీధి దీపాల విజ్ఞానమే నిను అంతరంగా దర్శించే పాఠాలు నేర్పాయి.

శివ నీ దయ.

Monday, October 13, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
సకల ఘటనలను సులువుగా రచియించి,
అందులో తోసేవు మమ్ములను తోలుబొమ్మలను చేసి,
ఆ పాత్రదారులకు సూత్రదారములు కట్టి,
ముడి తీసే మెలికను మరిచానంటావు...
సూత్రదారి                                           
చిత్ర విచిత్రాలు నీకే సాద్యం
జిత్తుల మారులను
చిత్తులుగా చేసి
చిత్తలు హరించేవు 
చిదానందా
చిద్విలాస
చితి నివాస
ఈశా
ఇంత లీల నీకు తాగునా.

శివ నీ దయ.

శివోహం

శివ!
జారిపడే కన్నీటి బోట్టు బరువుగా వుండకపోవచ్చు కానీ  దానిలో దాగివున్న బాధ మాత్రం బరువుగానే ఉంటుంది...
అలా అని...
కష్టం గా ఉందని నా దారి మార్చుకొను...
కష్టాలు ఉన్నాయని నిన్ను తలవడం మానేయను...
ఎన్ని కష్టాలు పెడుతావో పెట్టుకో ఆది మీ ఇష్టం.

శివ నీ దయ.

Sunday, October 12, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
ఏమి మాయజేస్తావో...
మహామాయావి పరవశింపజేస్తావు...
నీ వశం జేసుకుంటావు మరువనీయవు నిన్ను
మమేకం జేసుకుంటావు నీలో  
మహాదేవుడైయ్యావు నీవు.

శివ నీ దయ.

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...