Monday, October 13, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
సకల ఘటనలను సులువుగా రచియించి,
అందులో తోసేవు మమ్ములను తోలుబొమ్మలను చేసి,
ఆ పాత్రదారులకు సూత్రదారములు కట్టి,
ముడి తీసే మెలికను మరిచానంటావు...
సూత్రదారి                                           
చిత్ర విచిత్రాలు నీకే సాద్యం
జిత్తుల మారులను
చిత్తులుగా చేసి
చిత్తలు హరించేవు 
చిదానందా
చిద్విలాస
చితి నివాస
ఈశా
ఇంత లీల నీకు తాగునా.

శివ నీ దయ.

శివోహం

శివ!
జారిపడే కన్నీటి బోట్టు బరువుగా వుండకపోవచ్చు కానీ  దానిలో దాగివున్న బాధ మాత్రం బరువుగానే ఉంటుంది...
అలా అని...
కష్టం గా ఉందని నా దారి మార్చుకొను...
కష్టాలు ఉన్నాయని నిన్ను తలవడం మానేయను...
ఎన్ని కష్టాలు పెడుతావో పెట్టుకో ఆది మీ ఇష్టం.

శివ నీ దయ.

Sunday, October 12, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
ఏమి మాయజేస్తావో...
మహామాయావి పరవశింపజేస్తావు...
నీ వశం జేసుకుంటావు మరువనీయవు నిన్ను
మమేకం జేసుకుంటావు నీలో  
మహాదేవుడైయ్యావు నీవు.

శివ నీ దయ.

Saturday, October 11, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
ఎత్తినా చేయి దించకుండా...
అలనాడు చేయెత్తి శిరసున ఉంచి భస్మాసురుడికి వరమిచ్చినట్టు...
ఈనాడు కరములతో హరిద్ర కుంకుమ గంధములతో శిరసును అలంకరించాను...
నాక్కూడా భస్మాసురుడికి ఇచ్చిన  వరమియవయ్య హర.

శివ నీ దయ.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
కొన్ని బంధాలను బాంధవ్యాలను నిలుపుకోవడం కోసం...
కొన్ని సార్లు గుడ్డివాడిగా, మరి కొన్ని సార్లు చెవిటివాడిగా, ఇంకొన్ని సార్లు మూగవాడిగా నటించాల్సిన అనివార్యత.
నా నాటకం నీవు తెరదించే వరకు. 

Thursday, October 9, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
ఇంతకాలం నా మనస్సు నిన్ను విడిచి ఇంద్రియాలకు వశుడై ఒక పశువువలే తిరిగింది...
ఈ నా మనస్సు కొద్ది సమయం నా మాట విన్నట్టు గా వుంటుంది. మరలా కొద్ది సేపు నీ నుండి వెళ్లి గతజన్మ లనుండి తనకు ఆలంబనగా పట్టుకువచ్చిన వాసనలను పట్టుకుంటోంది శంకరా...
ఈ మనస్సు అనే పశువు కి యజమాని నీవే కదా...
ఆ పశువును పలుపు తాటితో కట్టి 
నీ పదమునుంచలేవా.?
ఆ వరము నీయలేవా.?

శివ నీ దయ.

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...