Monday, September 1, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

వనములోని దేవతరువులన్నీ నీవే, తరువుల్లో కదిలే ఖగమృగాలన్నీ నీవే,
ఎప్పుడూ నీవే, అంధకారమున వెలుగువు నీవే, 
కష్టమున తోడువు నీవే, 
కనులు చెమ్మగిల్లిన వేళ ఓదార్పు నీవే, 
గురువులకు గురువైన ఆదిగురువువు నీవే, 
సకలం నీవే  నా సర్వము నీవే 
చెన్నమల్లికార్జునా సర్వభరితుడవై నాకెందుకు కనరాకున్నావు.

అక్క మహాదేవి వచనం నుండి

Sunday, August 31, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

అక్కమహాదేవి వచనం నుండి.

తప్పించుకొనే తీరేది చెప్పరా...
వెనుక చెరువు ముందు వలలు...
నీవు బంపిన మాయ చంపుతోంది...
కుశల మింకెక్కడిది చెప్పరా...
కావుమయా కావుమయా చెన్నమల్లికార్జునా

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

అలవాటు దారితప్పి ఆట నడుపుతుంది...
అందులో పడి తెలియక మనసు మునుగుతుంది...
ఎదురించక బ్రతుకంత రాజీపడి పోతె...
సుఖములేని జీవితము విషము నింపుతుంది...
అందుకే
మనసులోన ఉన్నదే మాటలోన నిలుపు...
మాటలోని సత్యాన్ని జీవితంతొ
కలుపు...
కష్టాలకు నీవెపుడు కదలి పోకు...
నీ ధైర్యమె అందరికి ఔను మేలు కొలుపు.

ఓం నమః శివాయ.

Friday, August 29, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!

నేను ఒక పశువును...
నీవు నాపశుపతి నాథుడవు...
నేను ఎక్కడెక్కడో తిరిగి నామస్తిష్కం లో పనికిరాని చెత్త తో వచ్చాను...
నీన్ను చూడగానే నాకు ఒక అలౌకిక మైన భావనకు గురి అయను నామనస్సు నీదై నీపాదల వద్ద ఉంచుతున్న.

శివ నీ దయ.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!

నిను పూజించుటకు పనికి వచ్చిన చేతులు 
నిను సేవించుటకు ఉపకరించిన శరీరము 
నిను తలచుటకు పరితపించు మనము 
నిను కొలుచుటకు సహకరించు పరిస్థితులు 
నీవు తప్ప మరే ప్రపంచము వలదు
ఈ భాగ్యము చాలు తండ్రి...

శివ నీ దయ.

Tuesday, August 26, 2025

వినాయక చవితి శుభాకాంక్షలు

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

ఓం గణేశా!
గడ్డుకాలమైన జీవితానికి 
గమ్యాన్ని చూపుమయా...
విసిగిస్తున్న విఘ్నాలను వినాశనమొందించుమయా...
మా సర్వకార్యాలను శుభంగా సిధ్ధింపజేయుమయా...
మా మోహములను తొలగించి మొక్షమునివ్వుమయా...
అశాశ్వతమైన మా జీవితాలకు శాశ్వతముక్తిని ప్రసాదించుమయా.

ఓం గం గణపతయే నమః.

ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం ఆత్మీయులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

hare

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

క్రిష్ణ!

మీదైన ఈ మాయలో ఏదో ఒకటి జరిగే తీరుతుంది...
ఏది ఏమైనా పట్టిన మీ పాదములను వీడనీయకు తండ్రీ.

హరే క్రిష్ణ
ఓం నమో వేంకటేశాయ.

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...