Friday, August 29, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!

నేను ఒక పశువును...
నీవు నాపశుపతి నాథుడవు...
నేను ఎక్కడెక్కడో తిరిగి నామస్తిష్కం లో పనికిరాని చెత్త తో వచ్చాను...
నీన్ను చూడగానే నాకు ఒక అలౌకిక మైన భావనకు గురి అయను నామనస్సు నీదై నీపాదల వద్ద ఉంచుతున్న.

శివ నీ దయ.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!

నిను పూజించుటకు పనికి వచ్చిన చేతులు 
నిను సేవించుటకు ఉపకరించిన శరీరము 
నిను తలచుటకు పరితపించు మనము 
నిను కొలుచుటకు సహకరించు పరిస్థితులు 
నీవు తప్ప మరే ప్రపంచము వలదు
ఈ భాగ్యము చాలు తండ్రి...

శివ నీ దయ.

Tuesday, August 26, 2025

వినాయక చవితి శుభాకాంక్షలు

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

ఓం గణేశా!
గడ్డుకాలమైన జీవితానికి 
గమ్యాన్ని చూపుమయా...
విసిగిస్తున్న విఘ్నాలను వినాశనమొందించుమయా...
మా సర్వకార్యాలను శుభంగా సిధ్ధింపజేయుమయా...
మా మోహములను తొలగించి మొక్షమునివ్వుమయా...
అశాశ్వతమైన మా జీవితాలకు శాశ్వతముక్తిని ప్రసాదించుమయా.

ఓం గం గణపతయే నమః.

ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం ఆత్మీయులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

hare

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

క్రిష్ణ!

మీదైన ఈ మాయలో ఏదో ఒకటి జరిగే తీరుతుంది...
ఏది ఏమైనా పట్టిన మీ పాదములను వీడనీయకు తండ్రీ.

హరే క్రిష్ణ
ఓం నమో వేంకటేశాయ.

Monday, August 25, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!
జీవిత చక్రం తిరుగుతున్నాళ్లు...
ఈ బ్రతకు పోరాటం తప్పదు...
అందుకే నా మనోవేదనకు మందు గా నీ నామ స్మరణను ఎంచుకున్న

శివ నీ దయ.

Sunday, August 24, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

నవ్వుతూ ఉండే ప్రతి వ్యక్తి వెనుక, 
ఏదో ఒక ధీమా ఉండే ఉంటుంది... 
నాకైతే ఎప్పుడూ నీవే శివ...
ఈ కాలము, ఊపిరి ఉన్నంత వరకూ..

శివ నీ దయ

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

సదాశివ!
తప్పించు కోలేని తరుణంలో
తప్పులు తెలిసి, తెలియక, చేసితిని 
తప్పు  చేసినట్లు విన్నవించు చున్న 
తప్పు  క్షమించి  నన్ను కాపాడు సదాశివ...

శివ నీ దయ.

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...