Thursday, June 19, 2025

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
అంధకారము లోని ఆనందం
అవని దాటి పుంతలు తొక్కుతొంది...

సంధికాలంలో  నవవసంతం
పుడమి దాటి పరవళ్లు  తొక్కుతోంది.

ఇచ్చేది నీవు మెచ్చేది నీవు...

ఐనా ఎందుకు మనసుకు ఈ బాధా ఎందుకు రోత
అసలెందుకు ఈ గందర గోళం లో చిందర వందర.

మహాదేవా శంభో శరణు.

Wednesday, June 18, 2025

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!
నా కష్టాలు కన్నీళ్లు చూసి నన్ను విడిచి వెళ్ళిపోకు నోరారా నిను శివ నీ దయ అని పిలుస్తా.

పదే పదే పలికి ఆ ఆనందంలో ఆకలి బాధను తెలియకుండా మరిచిపోత...

నీ లీల ఏంటో తెలియదు కానీ సంతోషంగా ఉంటే నీను మరచిపోతానని కష్టాల పాలు చేస్తున్నావా? తండ్రి...

నాలో ఉన్న నీవు నాతో పాటుగానే
పస్తులు ఉంటావా హర.

శివ నీ దయ.

Monday, June 16, 2025

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివా!
కాలం నన్ను తడిసిన కాగితంగా మార్చేసింది...
రాయడానికీ పనికిరాదు...
ఇటు కాల్చడానికీ వీలు కాదు.

శివ నీ దయ.

Sunday, June 15, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!
సందేహాల పురమీ మానవ దేహం
అహం, మోహం
రెండూ గుణశ్రేణియై నీకు నాకు మధ్య
దూరం పెంచుతున్నాయి శివ...
నీ త్రినేత్రమున వాటిని దగ్దము చేయరాదా.

శివ నీ దయ.

Saturday, June 14, 2025

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శిక్షించు సురులు ఎందరో కలరు సృష్టి లోన...
రక్షించు దేవుడవు నీవు కదా బూతనాథా...
క్షమా భిక్ష పెట్టు మాకు భిక్షమయ్యా...
నీ అడుగుల కడ పడి ఉందు నీలకంఠా.

స్వామి సుందర చైతన్యానంద.

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

దరిద్రులుకు దారిచూపి ధనమును అందించిన దయాళుడవు నీవు...
ద్వారపాలకులకు సహితము దాక్షిణ్యం చూపిన కార్యదక్షుడవు....
ప్రార్ధనకే ముసలిబారినుండి గజేంద్రుడిని కపాడిన రక్షకుడవు.
నను ఓ కంట కనిపెట్టి ఉంచు హరి.

ఓం నమో వేంకటేశాయ నమః.

Tuesday, June 10, 2025

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!
 కాలం నన్ను బంతిని చేసి ఆడుకుంటున్న...
ఆ కాలం నీ చేతిలోనే ఉందనే ధైర్యం నాకుంది తండ్రి...
నీ తనివితీరా ఆడేసుకో విసుగు పుట్టాక, ఆనందించి ఎక్కడో అక్కడ పడేయకుండ , నీ పక్కనే పడేయి 
నేను కూడా నిన్ను చూస్తూ గడిపేస్తా.

శివ నీ దయ.

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...