Monday, June 9, 2025

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!
జానెడు పొట్ట, బారెడు దేహమిచ్చావు...
ఏ పూటకా పూట పరగడుపుపే తండ్రి...
ఈ వెలితి జీవితాల వెతలే పదాలుగా కదిలి కవితలయ్యాయి...
సకల జీవులకధిపతివి నీవే కదా తండ్రి.
నిన్నే నమ్ముకున్నాను నా బరువు బాధ్యతలు నీదే.

శివ నీ దయ.

Saturday, June 7, 2025

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

ఈ ప్రపంచంలోనే అతిపెద్ద వేదిక *మనసు*...
ఇక్కడ ఆడినన్ని నాటకాలు ఇంకెక్కడా ఎవరు చూడలేరు...
ఈ రంగస్థలం ఎప్పుడూ ఖాళీగా ఉండదు...
రకరకాల భావోద్వేగాలు, కుట్ర కుతంత్రాలతో కూడిన నాటకాలు నిత్యం ఈ వేదికపై జరుగుతూనే ఉంటాయి.

ఓం నమః శివాయ.

Friday, June 6, 2025

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!
నీవు ఆడుకోవడం కోసం నాకు ఊపిరి పోసి...
నాబ్రతుకు పోరాటంలో ఊపిరి ఆడకుండా చేస్తున్నావు
నీకిది న్యాయమా తండ్రి!!
నా బాధలో నిన్నుగాక వేరొకరిని నిందించగలనా
అయినా నాది నిందకాదు ఆవేదన మాత్రమే ఆపద్భాందవా...
నీ శరణు కోరినానురా ఏ కొదవ నాకు ఏలరా హర.

శివ నీ దయ.

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

పంచభూతాల అధిపతి
పంచాక్షరాల మంత్రనిది
పంచామృత అభిషేక ప్రియ
పంచప్రాణాలు నీవేనయా.

ఓం శివోహం...సర్వం శివమయం.

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!
నా దేహాన్ని నీ ఢమరుకం చేసుకుని
మంచి మృదంగం మృదువుగా వినేలా ఆడించి ఆడుకో...
సర్వేశ్వరా నీ చేతిలో నా బతుకు కైలాస నిలయమే...
నను ఓడిపోనీయకు తండ్రి ఆ ఢమరుక లయలను నీతో నే తిరుగుతూనే ఉండాలి ప్రాణేశ్వర.

శివ నీ దయ.

Saturday, May 24, 2025

శివోహం

శివా!విశ్వంలో నేను నీ ప్రతిరూపంగాను
నీటిలోన నీవు నా ప్రతి బింబంగాను
తెలియవచ్చేము బింబ ప్రతిబింబాలై
మహేశా . . . . . శరణు .

Saturday, April 12, 2025

ప్రసన్న వదనం

 లంగా ఓణీ  వేసుకున్న అచ్చ తెలుగమ్మాయి...

కాటుక సొగసుల మాటున కలువల్లాంటి తన కళ్ళు...

దోరతనం పూసుకున్న దొండపండు లాంటి తన పెదాలు...

చక్కిలి గింతలు పెట్టే చేమంతుల్లాంటి చెక్కిళ్ళు...

చంద్రబింబాన్ని పోలినది ఆమె అరవిందం...

నుదుట మద్యన జ్యోతిలా ప్రకాశించే సింధూరము...

ఊగుతూ మనసు లాగుతూ ఉండే వయ్యారి వాలుజడ...

హొయలను  కురిపించే వయ్యారి హంస నడక

అద్బుత సోయగాలను చూపించే తన కాలి అందెలు 

మేటి సౌందర్యాన్ని చూసి మైమరచెను నా మనసు.

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...