Thursday, April 10, 2025

శివోహం

శివా!కంటి చూపు కోర్కెల కట్టబెట్టేను
లోచూపు కోర్కెల తుడిచిపెట్టేను
లోచూపుతో నీ చూపు కలియనీ
మహేశా . . . . . శరణు .

శివోహం

శివా!నిన్ను తెలిపెడి కన్ను నిలువు కన్ను
అడ్డుగోలుగ తోచు అడ్డు కన్ను
నిలువు కన్నును తెలిపి నిలుపుమయ్యా.
మహేశా . . . . . శరణు .

శివోహం

శివా!కంటి చూపు కోర్కెల కట్టబెట్టేను
లోచూపు కోర్కెల తుడిచిపెట్టేను
లోచూపుతో నీ చూపు కలియనీ
మహేశా . . . . . శరణు .

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!
జన్మ ఇచ్చింది నీవే...
బంధం ఇచ్చింది నీవే...
మరణం ఇచ్చేది నీవే...
ఇచ్చింది ఇచ్చినట్టు స్వీకరించడమే నా కర్తవ్యం...
లేని దానికోసం ఆశ పెట్టీ కాని దాని కోసం ఆరాట పడేలా చేయకు...
మంచి గంధానికి చల్లగాలి తోడైనట్టుంటుంది నీ భక్తి పరిమళం లో తన్మయత్వం పొందేలా దీవించు.

శివ నీ దయ.

Saturday, April 5, 2025

 శివా!

నీవు ఆడుకోవడం కోసం నాకు ఊపిరి పోసి

నాబ్రతుకు పోరాటంలో ఊపిరి ఆడకుండా

చేస్తున్నావు నీకిది న్యాయమా? తండ్రి...

అన్యమేరగనీ నాకు నా బాధలో నిన్నుగాక వేరొకరిని నిందించగలనా హర.

అయినా నాది నిందకాదు ఆవేదన మాత్రమే తండ్రి.

శివ నీ దయ.                                          

 https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శ్రీరామ రామ అంటే పాపాలు తొలుగు నండి...

శ్రీరామ నామము భవ తారక మంత్ర మండి...

స్మరించిన తరించును జన్మ ధన్య మగునండి...

గౌరికి  శివుడుపదేశించిన  శ్రీరామ నామమండి...

మధురాతి  మధురము శ్రీరామ నామము...

సులభము సరళము దివ్యాతి దివ్యము

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామనామ  వరాననే.

ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...