https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివా!
నీ సేవయే జీవనపరమార్థమాయే
నీ నామమే గానమాయే
నీ ప్రణవనాదమే నా శ్వాసాయే
నీ దివ్య స్వరూపమే నాలో దివ్యతేజమై వెలుగొందే
నీ యందే పరవశమొందే
నీ లోనే లయమాయే
ఇంకేమి కోరను.
శివ నీ దయ.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...