Sunday, March 23, 2025

 https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u


శివా!

పంచ భూతాధిపతివి నివని...

నీ పంచన చేరాను...

నా ఊపిరికి అధిపతివి కూడా నీవే కదా...

నేను చేసే సోహం నీకే అంకితం.


శివ నీ దయ.

 శివా!స్పురణమైనా, స్మరణమైనా నీ కరుణే

చరణమైనా, మరణమైనా నీ తోటే

ఆ ఎఱుక నెరుగ జేయుమా ఈ ఉపాదినే

మహేశా . . . . . శరణు.

Friday, March 21, 2025

 శివా!విశ్వాన నిన్ను వీక్షిస్తూ

శ్వాసలో నిన్ను గమనిస్తూ

సాగనెంచితి శ్వాస ఆగు వరకు

మహేశా . . . . . శరణు .

 శివా!

బెంగటిల్లాలని ఉందీ...

ఎందుకూ అని అడగకండి...

ఎందుకో నాక్కూడా తెలీదూ...

కారణం లేని బెంగ కూడా ఓ బెంగేనా అనీ అడగకూ...

అదే చెప్పుకోలేనంత పెద్ద బెంగ కాదు అలా అని చిన్నది కూడా కాదు...

ఎప్పుడూ ఈలాగే  నీ దరినే ఉంచేసుకో ఈశ్వరా..

ఇంకో జన్మ అంటూ నన్ను ఏ దరికీ పంపించకు ఈ బంధాలకు బంధీని చేయకు

అసలు ఈ లోకానికి నేను సరిపడనూ.

శివ నీ దయ.

శివోహం

 https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u


శివా!

అంతరంలో ఏదోతెలియని దిగులుతో ఉన్నది వదిలేసి లేని దాని కోసం బ్రమసి నిరంతరం వెంటరాని వాటి కోసం విలపిస్తాము...

నువ్విచ్చిన ఈ మేనును మమతలమాలగామార్చి నీ పదముల చెంతచేరాను.

ఉన్నదని ఉరుకులు లేవు. 

ఏమి లేదని వేదన లేదు...

నేను కోరిన నువ్వు నా చెంతన

ఉండగా నాకెందుకు చింతన.


శివ నీ  దయ.

Thursday, March 20, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

బ్రతకలేని మనసులకి బంధాలు ఇచ్చి
నీవే మా బ్రతుకు రాసిన మాపై నీకు ఈ ఆటలు ఎందుకు...
నీవు ఆడేందుకు మేమేమైన ఆట బొమ్మలా 
నీవు పాడేందుకు మా జీవితాలు ఏమి పాట పదనిసలా
ఇది నీకేమి ఆనందమో ఎరుక లేని మాకు
ఎరుక చేయి.

మహాదేవా శంభో శరణు.

Wednesday, March 19, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా! 
నా బ్రతుకు చిత్రంలో...
మీ చిత్రం ఎల్లప్పుడూ నా వెంటే...

శివ నీ దయ.

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...