Tuesday, March 18, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా! గుండె గుప్పెడైనా
నాలుగు గదుల విశాల హృదయ ప్రదేశమది...
మదినిండా నీవు నిండివుండగా నా జీవన, తపన, ధ్యాన, ధ్యాస లను నాలుగు గదుల నింపి నీకు అంకితం ఇస్తున్నా...
సదా నీ స్మరణతో నా నోట ఓం నమః శివాయ ను పలికించు చాలు.

మహాదేవా శంభో శరణు.
శివ నీ దయ.

శివా!నాలో వున్న నిన్నునేను నేరుగా నిన్ను చూడలేననినా ప్రతిబింబమై తెలియ వచ్చావామహేశా . . . శరణు

Sunday, March 16, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!
కలిమాయలతో కలబడినాను 
కడకేమౌనో  కానగలేను...

కలుగజేసుకొని కావుము దేవా
కరుణాభయ కారకా బాపగ నా వేదనా.

శివ నీ దయ.

శివా!ఆది అన్నది నీకే అందివచ్చేనులేదనుమాట లేదని తెలియవచ్చేనునీ నుదిటి కంటి చూపు ఎఱుక నిచ్చేనుమహేశా . . . . . శరణు.

Saturday, March 15, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివా!
నా జీవితమే ఒక స్వప్నం నిన్నటి రోజున ఉన్నది నేడు లేకపోయే.

ఈరోజు ఈ క్షణం తర్వాత ఏమగునో అందుకే శివ నీ దయ అంటూనే ఉంటాను
ఏదో సమయంలో వచ్చి
నన్ను చూసిపో తండ్రి.

మహాదేవ శంభో శరణు.

శివా!నీకై వెతుకులాటలో నేనునన్ను సాకుతూ వెనువెంట నీవుఇలా ఎన్నాళ్ళు, ఒకటవగ ఇంకెన్నేళ్ళుమహేశా . . . . . శరణు .

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...