Sunday, March 2, 2025

శివోహం



పర్వతాల మీద కూర్చుని తపస్సు చేయడం సులభమే...
కానీ
కుటుంబం లో అందరి మధ్య కూర్చొని ఓపిక పట్టడం కష్టం
ఇదే అసలైన తపస్సు కదా శివ.

శివ నీ దయ.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!
తిరుగుడు ఎంతకాలం తిరగగలను...
ఏదో ఒక రోజు మూలన పడతాను కదా.
అంత వరకు ఎందుకు అదును చూసి శుభ ముహూర్తం పెట్టు నీ పంచనా చేరే దారి చూపించు.

శివ నీ దయ.

Friday, February 28, 2025

శివోహం

శివా! "నేను"
శవంగా మారక మునుపే నను 
జీవమున్న మనిషిగా తీర్చిదిద్దు
జీవాత్మ తల్లడిల్లి పోతుంది బాధగా 

శివా! "నేను"
నిను చేరక ముందే నను మేలుకొలుపు 
నిను నిత్యం ఆరాధించు దారి చూపించు 
నా నడకలు నీవైపు నడిచే విధం బోధించు

శివా!  "నేను"
ఏ జన్మలలో చేసుకున్న పుణ్యమో  
ఈ జన్మమున మానవునిగ పుట్టాను
నిజానికి నేనే నాడైనా మనిషిగ నడిచానా

శివా! "నేను"
దాన ధర్మములు ఏమి చేయలేదు 
నను సాయమడిగిన వారిని ఆదరించ లేదు 
నేను నేనను అహము నాలో చావడం లేదు 

శివా! "నేను"
నలుగురిలో పుట్టి పెరిగి పెద్దవాడినై, ఆ
నలుగురి కోసం ఏనాడు ఆలోచించ లేదు,
కలిమి లేముల తేడాలతో దూరం చేసుకున్నాను

శివా! "నేను"
మారిపోయాను, నన్ను మన్నించి మంచి 
దారి చూపించు నిజమైన మనిషిగా మసలేలా
కరుణించి నిను చేరే లోపు నను మానవునిగా మార్చు

Wednesday, February 26, 2025

శివోహం

అతను మాట
ఆమె అర్ధం
ఆమె పట్టు
అతను విడుపు
అతను సగం
ఆమె సగం
అతను పుట్టుక లేని వారు
ఆమె ప్రతి పుట్టుక మహా పురాణం
ఆమె ప్రేమ
అతను ప్రతిరూపం
ఓం శివాయ...సర్వం శివమయం 
                             @మోహన్ వాంకుడొత్@

Tuesday, February 11, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

కుడి ఎడమ కనుల...
నిను మనసారా కాంచితిని...
నోరారా కీర్తించితిని...
భజనలు చేసితిని...
ఉదయం నుండి సాయంత్రం వరకూ నేతిరిగిన అన్ని ప్రదేశాల నిన్ను ఆరాధించితిని...
రాత్రికి నిన్ను గుర్తు చేసుకుంటూ ఆరెండు కనులు మూసి...
బయట నేతిరిగిన నిమిషాలు మూడవ నేత్రంతో కాంచుకునేలా...
లోపల క్షణాలుగా నిన్ను తలంచు చున్నాను...
లోపలనుండి నీవెలుగుతో నన్ను నడిపించవా శివా...
పగలు మెలకువలో రాత్రి నిదురలో అనునిత్యం నీ స్మరణే నాకు శరణ్యం...

మహాదేవా శంభో శరణు...

Sunday, February 9, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

బాహ్యంలో నా "నేను" ఊరేగుతూ
అంతరంలో నా "నేను" కు దూరమై
ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు నావి...
నను ఓ దరికి చేర్చవా హర...

మహాదేవ శంభో శరణు.

Friday, February 7, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!
కోరికల ఇటుకలు కాలి
బ్రతుకు పోరాటముల మట్టితో
గూడు కట్టుకుంట,...
కాసింత జాగా ఈయవా కైలాసంలో...
తొలి అడుగు నీవే...
అమ్మ గృహప్రవేశం చేసిపెట్టేలా అర్జీ పెట్టుకున్న
ఎందుకంటే నన్ను
నేను మరచిపోవాలంటే ...
ఏ జన్మలో నైనా ఎప్పుడూ
మహాదేవా నీ ముందు మోకరిల్లాలి.

మహాదేవ శంభో శరణు.

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...