శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
Friday, April 19, 2024
శివోహం
శంభో...
జీవితంలో ఎన్నింటినో దాటుకుని...
ఎన్నింటినో పోరాడి...
ఎన్నింటికోసమో ఆరాటపడి...
జీవితం మొత్తం అనుక్షణం జీవించడానికే ఆశపడుతూ...
చివరికి పిడికెడు మట్టి గానో...
పిడికెడు బుడిదగానో మారడానికే కదా...
కానీ నా ఆరాటం ఆ పిడికెడు బుడిది నీకు భస్మం అయితే చాలు తండ్రి...
శివోహం
శివా!చిన్నప్పుడు నిన్ను జేజన్నాను
కొంత పెరిగాక నిన్నే శివుడన్నాను
నేడు తెలిసాక నీవే నేనంటున్నాను
Thursday, April 18, 2024
శివోహం
శివ,
నీ పాదకుసుమవ్వాలనే కామాన్ని కలగనివ్వు...
నిన్ను చేరక పలుతావుల తిరిగే మనసు పై క్రోధాన్ని పెరగనివ్వు...
నిరంతరం నిన్ను నా కనులారా చూడాలనే మోహాన్ని నిలువనివ్వు...
నీవు నా స్వామివనే లోభాన్ని వుండనివ్వు...
నా ఆర్తిని వేడుక తో చూసే నీపై నన్ను నీ దరికి చేర్చుకోలేద నే మదమాత్సర్యాన్నీ కలగనివ్వు నువ్వు కల్పించిన
ఈ అరివర్గ పాశాలను నీ దరికి చేర్చే ప్రణవమార్గాలుగా మారనివ్వు.
శివోహం
శివ!
ఎన్నిసార్లు మీ ముందర మోకరిల్లినా...
ఇచ్చిన ఋణం తీరిపోవునా...
ఎన్నిసార్లు చక్కని పూలతో అలంకరణ చేసినా...
చల్లని మీ చూపుల స్పర్శకు సాటిరాగలదా...
విధిగా ఆలయ పరిసరాలు శుభ్రం చేసినా మీ సన్నిధిలో పొందిన మనశ్శాంతి మరెక్కడైనా దొరుకునా
ఏది చేసిన, ఏమి ఇచ్చినా అవన్నీ నీవు ఇచ్చిన భిక్షయే కదా హర...
Wednesday, April 17, 2024
శివోహం
ఏ ప్రాణులు తమ మనస్సు,బుద్ధి,
అంతరాత్మతో భగవంతుని శరణు వేడుతారో,
ఎవరు లౌకిక మోహాలను అన్నిటినీ విడిచి
పరమేశ్వరుని తన సొంతం అనుకుంటారో,
వారు అన్ని కర్మల నుండి
విముక్తులై మోక్షాన్ని పొందుతారు.
ఓం నమః శివాయ
ఓం శివోహం... సర్వం శివమయం
శివోహం
భోగం అంటే పరమాత్మ సన్నిధి…
భాగ్యం అంటే శాంతి...
భోగభాగ్యాలు అంటే పరమాత్మ సన్నిధి లో లభించే శాంతి.
ఓం నమః శివాయ
ఓం శివోహం సర్వం శివమయం.
Subscribe to:
Posts (Atom)
శివోహం
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
-
శివా!మట్టితో అనుబంధ మెంత గొప్పదో పుట్టి గిట్టుటలోన నేను మట్టినే కూడి మట్టి బొమ్మను నిను తెలిసి మురిసినాను మహేశా . . ... . శరణు .
-
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! సందేహాల పురమీ మానవ దేహం అహం, మోహం రెండూ గుణశ్రేణియై నీకు నాకు మధ్య దూరం పెంచుతున...
-
శివా! నీ నాట్యానికి నా అహము వేదిక కానీ నీ నామము నా పదమున దీపిక కానీ నా గమనం నిన్ను చేరీ ముగిసిపోనీ మహేశా.....శరణు.