శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
Sunday, April 7, 2024
శివోహం
శ్రేష్ట కర్మ లా చేత బుణములను కరిగించి....
స్వేచ్ఛ నిస్తున్నది....
నీ చేరువకే కదా శివా…
మహాదేవా శంభో శరణు.
శివోహం
ఈ పాదం పుణ్యపాదం
ఈ పాదం దివ్యపాదం
ప్రణవ మూల నాదం ప్రథమలోకపాదం
ప్రణతులే చేయలేనిఈ తరమేల ఈ కరమేల
ఈ పాదం పుణ్యపాదం ధరనేలే ధర్మపాదం
మార్కండేయ రక్షపాదం మహాపాదం ఆ...
భక్తకన్నప్ప కన్న పరమపాదం భాగ్యపదం
ఆత్మలింగ సయంపూర్ణ ఆత్మలింగ స్వంపూర్ణుడే సాక్షాత్కరించినా
చేయూతవీడినా అయ్యో అందని అనాధనైతి మంజునాధా
ఈ పాదం పుణ్యపదం ధరనేలే ధర్మపదం
ప్రణయమూల పాదం ప్రళయ నాట్యపాదం
ప్రణతులే చేయలేని ఈ శిరమేల ఈ బ్రతుకేల
భక్త శిరియాళు నేలిన హేమపాదం
బ్రహ్మ విష్ణులే భుజించే ఆదిపాదం అనాదిపాదం
అన్నదాత విశ్వదాత లీలా వినోదిగా
నన్నేలగా దిగిరాగా అయ్యో చీ
పొమ్మంటి నే పాసినై తినే ఈ పాదం పుణ్యపాదం ఈపాదం
ధర్మపాదం
సకల ప్రాణపాదం సర్వమోక్ష పాదం
Saturday, April 6, 2024
హరిహారపుత్ర అయ్యప్ప శరణు
ఎంతటి కష్టానికైన హద్దంటూ ఉండదా...
ఏ దోషానికైన ఒక పద్దంటూ ఉండదా...
తండ్రివి నీవుగాక తప్పులెవరు మన్నింతురు...
దండించిన తదుపరి మము అక్కునెవరు చేర్చెదరు...
నడుపుమమ్ము నీగతిలో చేర్చుకో మణికంఠ...
శివోహం
శివ!
గడ్డకట్టిన జ్ఞాపకాలను నేను నెమరేసుకుంటుంటే తెలిసింది ఊహల ఊర్ధ్వలోకాలలో ఉన్నానని.
శివ నీ దయ.
Subscribe to:
Posts (Atom)
శివోహం
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
-
శివా!మట్టితో అనుబంధ మెంత గొప్పదో పుట్టి గిట్టుటలోన నేను మట్టినే కూడి మట్టి బొమ్మను నిను తెలిసి మురిసినాను మహేశా . . ... . శరణు .
-
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! సందేహాల పురమీ మానవ దేహం అహం, మోహం రెండూ గుణశ్రేణియై నీకు నాకు మధ్య దూరం పెంచుతున...
-
శివా! నీ నాట్యానికి నా అహము వేదిక కానీ నీ నామము నా పదమున దీపిక కానీ నా గమనం నిన్ను చేరీ ముగిసిపోనీ మహేశా.....శరణు.