శివ!
కలలు కన్నజీవితం కలిమయాలో చిక్కి కల్లోల కడలి అవుతుంది..
ఇక నాకు మిగిలినది కలవరమే...
నీ కరుణతో కడలినే క్షీరమయం చేసి కలిమయా నుండి తప్పించు.
మహాదేవా శంభో శరణు.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...