Monday, March 18, 2024

శివోహం


నా ఏకాంతం లోని నీ కాంతి..
నాకు  తోడు  అయితే...
నీలో  ఏకం  కావాలని...
ఒక  నీడ  ఎదురు చూస్తుంది.
మహాదేవా శంభో శరణు.


శివోహం

బ్రతుకు ఎంత భారమైన

భరోస నిచ్చే అండ నివని

నా మనసు గుడి కాకా నీ ఒడి కోరుతుంది
మహాదేవా శంభో శరణు.

శివ నీ దయ

శివోహం

గుండె గుప్పెడైనా
నాలుగు గదుల విశాల హృదయ
ప్రదేశమది
మదినిండా నీవు నిండివుండగా
జీవన, తపన, ధ్యాన, ధ్యాస లను నాలుగు గదుల నింపి
నీకు అంకితం ఇస్తున్నా
నానోట ఓం నమఃశివాయ ను పలికించు చాలు
సదా నీ స్మరణతో....
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...