తట్టుకోలేని బాధలు నీవు ఎన్ని ఇచ్చిన నిత్యం నీ నామమే తలుపుతడుతోంది...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
Wednesday, October 11, 2023
శివోహం
నీ కాంతి బిందువుల నుండి పుట్టిన ఈ మట్టిలోని అణువణువూ తిరిగి నీలో ఐక్యం కావాలని
పరితపిస్తూ ఉంది కాంతికి కలిగిన కోరికలు
మట్టికి అనుభవాలు అనుభవాలు జ్ఞానమై
జ్ఞానం సత్యమై
సత్యం శివమై
శివమ్ సుందరంగా
ఆవిష్కరణ చెందిన క్షణం నేను నీలోకి ఐక్యం.
Tuesday, October 10, 2023
శివోహం
ఉంచుకోడం లోకన్నా పంచుకోడంలో ఎక్కువగా ఆనందాన్ని తృప్తినీ పొందేది...
పరమాత్మ తత్వ చింతనతో మనసు పండితేనే అలాంటి నిష్కామ ప్రవృత్తి అలవడుతుంది...
జై శ్రీరామ్...జై హనుమాన్
జై శ్రీమన్నారాయణ
ఓం పరమాత్మనే నమః
శివోహం
శివా ! తలచిన శివుడే , తలపున శివుడే, తలపులోన శివుడే, గడపన శివుడే, గడుపును శివుడే, కడుపున శివుడే, నడచిన శివుడే, నడుపును శివుడే , కుడిచిన శివుడే, తడబడు అడుగులు నడుపును శివుడే, గనపడ గనపడి శివుడే, వగచిన శివుడే, పిలిచిన శివుడే, మలచిన శివుడే, సగమున శివుడే, నగవున శివుడే, శివా నీ దయ శివా నీ దయ
శివోహం
శివా!బ్రతుకు పొలమున భక్తి హలమును పట్టి
జ్ఞాన వైరాగ్యములు పండించ నిన్ను కొలిచి
సేధ్యము చేయ బూనితి కాస్త సహకరించు
శివోహం
నెత్తిన తైతక్కల గంగ...
నుదుటన నిప్పులుమిసే కన్ను...
కంఠాన విషపు కొలిమి మేన కాష్ఠపు బూది చాలవా నీకు...
బహు తిక్కల రేడు వని తెలుప ఈ విన్యాసమేలా...
శివోహం
నెత్తిన తైతక్కల గంగ...
నుదుటన నిప్పులుమిసే కన్ను...
కంఠాన విషపు కొలిమి మేన కాష్ఠపు బూది చాలవా నీకు...
బహు తిక్కల రేడు వని తెలుప ఈ విన్యాసమేలా...
Subscribe to:
Posts (Atom)
శివోహం
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...