ఊపిరి వదిలేదాకా నీ నామ స్మరణ వదిలేదే లేదింక...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
Thursday, July 13, 2023
Wednesday, July 12, 2023
శివోహం
భక్తి వల్ల జ్ఞానం వస్తుంది...
మరి నిర్మలమైన భక్తి నీదైతే...
నువ్వు నమ్మే దైవం నిత్యముని చెంతే కదా...
శివోహం
బురదలో అంటకుండా నడవడం కష్టమే...
నీటిలో తడవకుండా మునగడం కష్టమే...
కష్టాల కడలిలో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, పరమాత్మ పై మనసు నిలపడం కూడా కష్టమే...
కానీ శివ నీ దయ అంటు చేతులెత్తి మ్రొక్కడం కష్టమేమీ కాదు కదా మిత్రమా...
Tuesday, July 11, 2023
శివోహం
సహజంగా పుట్టుకతో మనిషిది మంచిస్వభావం గా ఉంటుంది...
కానీ మనిషి పెరిగే కొద్దీ క్రమంగా అతడి స్వభావం పై ప్రభావం చూపే అస్తి, బలగం డబ్బు, కీర్తీ, ఉద్యోగం,దేహ బలంతో ,అతడి కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలు పెరుగుతూ మనిషి స్వభావాన్ని మార్చేస్తు దుర్గతి పాలు చేస్తు ఉంటాయి...
మంచి మనిషిగా ఎదగాలంటే అలాంటి పశుతత్వాలు ఈ దివ్య మైనప్రేమ తత్వానికి అడ్డురాకుండ చూడాలి , దైవారాధన స్వభావం తో ఆనందంగా జీవించాలి , ఎదుటివారిని కూడా అదే ఆనంద నిలయంలో కలుపుకుంటూ వారిలో కూడా ప్రేమతో అనందాన్ని దర్శిస్తూ భగవద్ సాక్షాత్ కార భాగ్యాన్ని పొందే ప్రయత్నం చేద్దాం...
Subscribe to:
Posts (Atom)
శివోహం
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
-
శివా!మట్టితో అనుబంధ మెంత గొప్పదో పుట్టి గిట్టుటలోన నేను మట్టినే కూడి మట్టి బొమ్మను నిను తెలిసి మురిసినాను మహేశా . . ... . శరణు .
-
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! సందేహాల పురమీ మానవ దేహం అహం, మోహం రెండూ గుణశ్రేణియై నీకు నాకు మధ్య దూరం పెంచుతున...
-
శివా! నీ నాట్యానికి నా అహము వేదిక కానీ నీ నామము నా పదమున దీపిక కానీ నా గమనం నిన్ను చేరీ ముగిసిపోనీ మహేశా.....శరణు.