Tuesday, June 20, 2023

శివోహం

జ్ఞానంతో  చెప్పే వారి మాటలు వినకపోయిన పర్వాలేదు...
కానీ...
అనుభవంతో చెప్పే వారి మాటలు వినాలి...
ఎందుకంటే జ్ఞానం కన్న అనుభవం గొప్పది...

ఓం గం గణపతే నమః

శివోహం

శివ శంకరా...
అభయంకరా...
నేను చెబితే గానీ నీకు తెలియని విషయమా ఇది...
నా నుదుటి గీతలు వ్రాసినా దేవా దేవుడివి నీవు...
వ్రాసినవి చేరిపి తిరిగి వ్రాయగలిగినది నీవే... చదవగలిగేది నీవే...
నా నుదుటి వ్రాత నీచేతి రాత ఎలా ఉందో చూసుకో నన్ను కాచుకో తండ్రి...

మహాదేవా శంభో శరణు...

Monday, June 19, 2023

శివోహం

సుఖం కలగాలంటే పుణ్య కార్యాలు చేయాలి...
ఎందుకంటే పాప కార్యాలు దుఃఖాన్ని కలిగించి నరకాన్ని చూపిస్తాయి...
ముక్తి కావాలంటే పరమాత్మ శరణాగతి చేయాలి...
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివా!పెక్కు మాటల నడుమ
మౌనం చేస్తోంది ఒంటరి పోరాటం
మౌనానికే నీవు మద్దత్తు పలుకుమా
మహేశా . . . . . శరణు .

శివోహం

భగవంతుని సృష్టిలో అంతా పవిత్రము...
యదార్థము ,సత్యము ,జ్ఞానమయము మరియు  శాశ్వతమైన బ్రహ్మ పదార్థం కూడా...
కాలచక్ర భ్రమణ ధర్మం వలన పదార్థంలో  ధర్మం లో శరీరంలో జగతిలో కలిగే  పరిణామాలు మనసులోని అనేక  ఆలోచనల వల్ల అనేక రూపాలుగా మార్పులు చేర్పులు చెందుతూ ఉంటున్నాయి
కానీ బ్రహ్మ మొక్కటే...
పరబ్రహ్మ మొక్కటే...

ఓం శివోహం...సర్వం శివమయం.

Sunday, June 18, 2023

శివోహం

శివ...
మాయ మంత్ర, తంత్రాలు, మదిలోకి చేరకుండా...
మనసులోని ఆలోచనలు వక్రమార్గం పోకుండా...
మదిలో తలపులు మమేకంగ ఉండి అనేకం కాకుండా... 
మాయాలోకంలో మనస్సు మారకుండా ఏకాగ్రతతో ఉంచుతున్న నీకె శరణు...
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!శత్రు సంహారాన నెగ్గు పినాకము
వామ హస్తమున దాల్చి విహరించు నీవు
నాలోని శత్రువులనణచగా రమ్ము .
మహేశా . . . . . శరణు .

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...