Tuesday, November 22, 2022

శివోహం

ఈ శరీరం
ఈ బంధువులు...
సంపదలు...
ఏవీ మనవి కావు...
మనం తయారు చేసినవి అసలే కాదు...
ప్రకృతిని జ్ఞానాన్ని దేహాన్ని అందమైన పరిసరాలను వాడుకొమ్మని సద్వినియోగం చేసుకొనమని...
అందుకు బదులుగా కృతజ్ఞత చూపేందుకు విజ్ఞానాన్ని ఇచ్చాడు నిజానికి ఆయనకు తిరిగి ఇచ్చేందుకు మనదంటూ ఏమీ లేదు...
అతనిది అతనికే సమర్పించడం తప్ప మరేదారి లేదు మనవద్ద...
అందుకే కృతజ్ఞతగా మనం చేయగలిగింది చేయవల్సింది భక్తితో చేతులెత్తి మనసుతో శివ నామం చేయడమే...

ఓం శివోహం...సర్వం శివమహం.

Monday, November 21, 2022

శివోహం

అనేకజన్మలపరంపరలగా కొనసాగుతున్న బహుదూరపు బాటసారిని నేను.
నా గమ్యం ఆ సదాశివుని స్థానం.
దారిలో బహుదారులలో ప్రయాణించేవారు తారసపడుతుంటారు.
నా లక్ష్యం ఆ సదాశివుని జేరుటయే...
ఆతర్వాత సదా తోడు నీడా ఆ సదాశివుడే...

ఓం శివోహం... సర్వం శివమయం.

హనుమా భక్తి

చిన్నప్పుడు...
రాముడంటే అమితప్రేమ...
హనుమాన్ అంటే అపారభక్తి...
అప్పటినుండే ఆద్యాత్మిక చింతన ప్రారంభమైంది...
భగవంతుణ్ణి భగవంతునికై భక్తిత్వముతో ఆరాధించడం అలవాటైంది...
ఆధ్యాత్మికత, భగవంతుడు అంటే ఏమిటో తెలుసుకోవాలన్న తపన నాలో కల్గి ఆ దిశలో జీవనయానం ప్రారంభించాను...

ఓం శివోహం...సర్వం శివమయం.

శివోహం

శివ...
నీ నామం రుచి చూపిన నీవు ...
ఓసారి ఇటు కన్నెత్తి చూడవయ్యా...
ఒకింత జాలి జూపక రావయ్యా...
ఓటమికి అంచులకు అలవడినానయా...
ఒంటరిని చేయక నను ఇకనైనా గురుతెరగవయా శంకర...

మహదేవా శంభో శరణు.

                               మోహన్ వి నాయక్.            


Sunday, November 20, 2022

శివోహం

కోరుచుందురు అందరు సుఖము...
వాస్తవానికి తెలియ దెవరికి సుఖము చిరునామా...
విషయ మందున సుఖము లేదు...
కాల మందున కలసిరాదు...
బయట లేదు లోన రాదు...
నీ స్వరూపమె పరమ సుఖము కదా శివ...
మహదేవా శంభో శరణు.
                                   🕉️మోహన్ వి నాయక్🕉️



శివోహం

ఆహా!ప్రభూ ! నీ లీలలు వర్ణించతరమ...
ఈ గులాబీ పుష్పం ఉన్న ఆకులు మొక్కలు ,మొగ్గల నిగ్గులు ఇలాంటి అందాలను ఒలికించే రంగు రంగుల పువ్వులు ఆకులు వృక్షాలు పచ్చిక బయళ్లు జగతిలో ఎన్నో కదా...
ఈ సృష్టి చిత్రవిచిత్రం అనంతం అందుకే ప్రకృతిలో ఎక్కడ చూసినా పరమాత్మ వైభవం దర్శించే భావించి స్పందించే అనుభూతిలో చూపులో, ప్రతిస్పందన లో ,అంతరంగంలో పొందే కమనీయము రమణీయం,మనోహరము కదా...

ఓం శివోహం.... సర్వం శివమయం.

Saturday, November 19, 2022

శివోహం

శంభో...
శరీరం నీవు నాకు ఇచ్చిన అద్దె ఇల్లు...
ఇది నాకు ఒక ఉపాధి మాత్రమే...
దీనిమీద సర్వహక్కులు నీవే..
జన్మనిచ్చినవానికి ఆ జన్మను తీసుకొనిపోయే అధికారం ఉంటుంది కదా...
ఈ ఇల్లు విడిచి పోవడానికి నేను సర్వం సిద్ధం చేసుకున్న...
ఇక నీ దయ...
మహాదేవా శంభో శరణు.  
                                  🕉️మోహన్ వి నాయక్🕉️

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...