Friday, November 18, 2022

శివోహం

పుట్టిన ప్రతి మనిషి ముగ్గురికి రుణ పడి ఉండాలి...
జన్మ నిచ్చిన తల్లిదండ్రులకు...
ధార్మిక మైన జీవనం  గడపడానికి శాస్త్రాలని అందించిన  ఋషులకీ...
మరియు ప్రాణుల్లో కెల్లా అతి ఉత్కృష్ట మైన మనిషి జన్మ ప్రసాదించి అందమైన ప్రకృతిని అనుభవించి   ఆరాధించడానికి కారకుడు అయిన ఆ పరమాత్మ కు  రుణపడి ఉండాలి.. 
ఓం శివోహం... సర్వం శివమయం.
                                        మోహన్ వి నాయక్.   

శివోహం

కర్మకు బుద్ధుణ్ణి...
బుద్ధిగ మానవుణ్ణి...
మానవుణ్ణి కానీ కనికరం తెలియదు ఈశ్వరా...
మహాదేవా శంభో శరణు.
A

శివోహం

శివ...
మోహమనే  కెరటాలకు  చిక్కి ఉన్నాను...
సతి అనేడి సుడిలో పడి లేవలేకున్నాను...
బిడ్డలు,  ప్రేమను  వదలలేక నీ శరణు కోరుతున్నాను...
మహదేవా శంభో శరణు.
                                  మోహన్ వి నాయక్
                                   భూలోక యాత్రికుడు


శివోహం

శివ...
ఎంత వారలైన విధికి వంచితులే  కదా...
వెనక  వచ్చు వారెల్ల వెనక  పోవుదురు...
కాని  నీవలె అక్కున చేర్చు వారెవరు...
మా పాలిట  భాగ్యముగా  స్మరియింతుమయ్య మహేశా...
మహాదేవా శంభో శరణు.
                                          మోహన్ వి నాయక్

Thursday, November 17, 2022

శివోహం

ఏలిక నీవయ్య...
మా కూడిక నీ తొనయ్యా...
మాతో పలుక వేమయ్య...
మా ప్రార్ధనను ఆలకిన్చవయ్యా...
మమ్మేలు కోవయ్య...
మా తప్పులు మన్నిమ్చవయ్యా...
మహదేవా శంభో శరణు.
                                           మోహన్ వి నాయక్.

శివోహం

తలపులు కొలదుల భజింతురు 
నిముషము మనసున సేవింతురు
ఘనమని తలచిన ప్రేమింతురు  
మరువను నిను నా మనసున...
మహదేవా శంభో శరణు.
                                         మోహన్ వి నాయక్

Tuesday, November 15, 2022

శివోహం

నమ్మకమే బలం....
నమ్మితే ప్రకృతి అంతా పరమేశ్వరుడి  ప్రతి రూపమే...
ఓం శివోహం... సర్వం శివమయం.
ఓం నమః శివాయ...

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...