Wednesday, November 9, 2022

శివోహం

భూమి పై పుట్టి...
ఎన్నో బంధాలు అనుబంధాలతో మొదలైన నా ప్రయాణం పెళ్ళి అనే బంధంలో చిక్కి
భార్యా బిడ్డలకు ప్రేమను పంచి
స్నేహం ను పెంచి భాదను భరించి
సుఖాన్ని అందించి
అహంను తొలగించి
కోపాన్ని తగ్గించి
శాంతీని కల్పించి
నేను అనే అహంకారాన్ని వదలి
మనం అనే మమకారం తో
జాలి దయ చూపుతూ
తీపి అనుభవాన్ని పంచుతూ
చేదు అనుభవాన్ని మర్చి పోతూ
కాలంతో పాటు తిరుగతూ అలసి పోయా...
మళ్ళీ మళ్ళీ ఏ తల్లి గర్భంలోకో పంపించక ....
నీ గుండెలోనే దాచుకో తండ్రీ .....
శివోహం  శివోహం

Tuesday, November 8, 2022

శివోహం

భగవంతునిపై భక్తునికున్న ఆరాధనే కాదు,
భక్తునిపై భగవంతునికున్న అనుగ్రహం కూడా అనంతమే, అద్భుతమే.
భక్తులు ఎలా పిలిస్తే అలా పలుకుతాడు.
భక్తునికై పరుగులు తీస్తాడు.
భక్తుని మనోభావసుధను గ్రోలి భక్తునికై సేవకుడుగా మారతాడు.
తనని సేవించే భక్తులకై పరుగులు తీసే పరమాత్మను నామ స్మరణతో ప్రసన్నం చేసుకివాలి...

ఓం శివోహం... సర్వం శివమయం

Monday, November 7, 2022

శివోహం

శివ నామం చేయండి...
ఆస్వాదించండి...
ఆస్వాదించి ఆనందించండి...
ఆనందించి తరించండి...  ఓం నమః శివాయ.

Saturday, November 5, 2022

శివోహం

భగవంతుడు, గుణరహితుడు, దయామయుడు, పసిబిడ్డ ఏడుపుకు తల్లి ఏవిధముగా తల్లడిల్లి పోతుందో అదేవిధముగా కలియుగాన్ని భక్తులను రక్షించుటకు పార్వతీ పరమేశ్వరులు తల్లడిల్లి పొతూ ఉంటారు.
ప్రార్ధన చేసినవారిని ఆదుకొని ఆనందాన్ని ప్రసాదిమ్చుతారు.

శివోహం

పగటి వేషాన్ని మరచి...
మనసులోని భయాన్ని విడిచి...
రాత్రి నిశబ్దాన్ని కల్పించి...
మనస్సును ప్రశాంతముగా ఉంచి...
వెన్నెలదీపాన్ని వెలిగించి పార్వతీ పరమేశ్వరులను వేడుకుందాం...
ఓం శివోహం... సర్వం శివమయం.

Friday, November 4, 2022

శివోహం

ప్రతి హృదయంలో పరమాత్మ స్తిర నివాసం...
ప్రతి ఒక్కరి హృదయం ఒక  ఆనంద నిలయం..
ప్రతి ఒక్కరిలొ ఉండే పరమాత్మ పేరు సచ్చిదానందం...
ప్రతి పనిలో  సంతృప్తి పడితే పొందేది జీవితానందం..

ఓం శివోహం...సర్వం శివమయం.

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...